Jaggareddy: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించడానికి భయపడుతున్నారు..

ABN , First Publish Date - 2022-09-07T20:58:01+05:30 IST

అసెంబ్లీ రెండు రోజులే నిర్వహిస్తామనడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించడానికి భయపడుతున్నారు..

హైదరాబాద్ (Hyderabad): అసెంబ్లీ (Assembly) నిన్న (మంగళవారం) 6 నిమిషాలకే ముగిసిందని, మళ్లీ రెండు రోజులే నిర్వహిస్తామనడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సభలో మాట్లాడానికి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. కేసీఆర్ సీఎం (CM KCR) అయ్యాకా.. ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ (appointment)ఇవ్వడం లేదని అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, ఆరు నెలల తర్వాత జరిగే సమావేశాలు మూడు రోజులకే పరిమితమా..? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ (TRS) ప్రజాప్రతినిధులు ప్రశ్నించడానికి బయపడుతున్నారని విమర్శించారు. కొన్ని డిపార్టుమెంట్లు బూజు పట్టిపోయాయని, హౌసింగ్ కనుమరుగైందని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్య వ్యవస్థ బూజు పట్టిపోయిందన్నారు. విఆర్ఏ (VRA)లు రాష్ట్రం వచ్చాక ఆగమయ్యారని, 23 వేల మంది విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలన్నారు. పే స్కేల్ పెంచాలని, రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ దేశం పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని, అసెంబ్లీలో మాట్లాడే వీలుండదు కాబట్టి తాను నిరసన తెలుపుతానన్నారు. ఈ నెల 12న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


నరేంద్రమోదీ (Narendramodi) పాలన అంతానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం నుంచి పాదయాత్ర (Padayatra) చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. మోదీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, మోదీ దేవుళ్ళ పేర్లను చెప్పి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రాహుల్ పాదయాత్రకు సంఘీభావంగా గురువారం అన్ని నియోజకవర్గాలలో పాదయాత్రలు ఉంటాయని, సంగారెడ్డిలో 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-07T20:58:01+05:30 IST