Hitech City Metro Station: మెట్రో ఎస్కలేటర్‌లో కాలు చిక్కుకుని..

ABN , First Publish Date - 2022-11-11T10:48:13+05:30 IST

నగరంలోని హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో గురువారం ఓ యువకుడు గాయపడ్డాడు. సాయంత్రం సమయంలో

Hitech City Metro Station: మెట్రో ఎస్కలేటర్‌లో కాలు చిక్కుకుని..

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో గురువారం ఓ యువకుడు గాయపడ్డాడు. సాయంత్రం సమయంలో రైలు దిగి ఎస్కలేటర్‌ ద్వారా కిందకు వస్తుండగా ప్రమాదవశాత్తు అందులో కుడికాలు ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావమైంది. సెక్యూరిటీ సిబ్బంది ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తీసుకురాకపోవడంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిసింది. తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో కొందరు ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై నిర్లక్ష్యం కనబరిచిన సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Updated Date - 2022-11-11T10:48:15+05:30 IST