ఖర్గేతో టీ-కాంగ్రెస్‌ నేతల భేటీ

ABN , First Publish Date - 2022-11-30T03:37:06+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఢిల్లీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కలుసుకున్నారు....

ఖర్గేతో టీ-కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఢిల్లీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కలుసుకున్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మహేశ్వర్‌రెడ్డి ఆయనను వేర్వేరుగా కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై, త్వరలో నియమించబోతున్న పీసీసీ కమిటీల కూర్పుపై చర్చించినట్లు తెలిసింది. ఖర్గే జాతీయ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా, కేవలం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.

Updated Date - 2022-11-30T03:37:06+05:30 IST

Read more