TS News: రేపు ఉదయం 11.30కి సామూహిక జాతీయ గీతాలాపన

ABN , First Publish Date - 2022-08-15T22:47:20+05:30 IST

Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 16వ తేదీ (మంగళవారం) ఉదయం 11.30కి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జాతీయ గీతాన్నిఆలపిస్తారు.

TS News: రేపు ఉదయం 11.30కి సామూహిక జాతీయ గీతాలాపన

Hyderabad: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) 16వ తేదీ (మంగళవారం) ఉదయం 11.30కి సామూహిక జాతీయ గీతాలాపన (National Anthem) కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జాతీయ గీతాన్నిఆలపిస్తారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాల్లో మైకుల ద్వారా ఈ జాతీయ గీతాలాపన ఉంటుంది. గీతాలాపన సమయంలో ట్రాఫిక్ ను 5 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు. సామూహిక గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్లొంటున్నారు. అబిడ్స్ నెహ్రూ విగ్రహం దగ్గర ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

Read more