హైదరాబాద్ ఖాకీల కామ లీలలు

ABN , First Publish Date - 2022-07-10T20:14:46+05:30 IST

హైదరాబాద్: హైదరాబాద్ ఖాకీల కామ లీలలు బయట పడుతున్నాయి. మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ కోరట్ల నాగేశ్వరరావు (45) ఉదంతం మరువక ముందే మరో ఎస్సై విజయ్‌కుమార్‌ లీలలు బయటపడ్డాయి.

హైదరాబాద్ ఖాకీల కామ లీలలు

హైదరాబాద్: హైదరాబాద్ ఖాకీల కామ లీలలు బయట పడుతున్నాయి. మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ కోరట్ల నాగేశ్వరరావు (45) ఉదంతం మరువక ముందే మరో ఎస్సై విజయ్‌కుమార్‌ లీలలు బయటపడ్డాయి. దీంతో ఆ ఎస్సైపై కూడా రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెన్షన్ వేటు వేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొందరు నిజాయితీగా, ఆదర్శంగా ఉంటుంటే మరికొందరు మాత్రం పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారు. అధికారం ఉందన్న గర్వంతో, తమకు ఎదురు చెప్పేవారు లేరన్న అహంకారంతో రెచ్చిపోతున్నారు. అడ్డదారులు తొక్కి డిపార్ట్‌మెంట్‌ పరువు తీస్తున్నారు. తాజాగా రాచకొండ పీఎస్ పరిధిలో ఓ ఇన్‌స్పెక్టర్, మరో ఎస్సై ఉదంతం పోలీస్ శాఖకే మచ్చ తెచ్చింది.


పోలీస్ శాఖలో నిన్నటి దాకా మారేడ్ పల్లి ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ఓ వివాహితపై క‌న్నేసిన నాగేశ్వర రావు ట్రాక్ తప్పాడు. వ్యామోహం పెంచుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఆమెను ఎలాగైనా శారీరకంగా లోబరచుకోవాలని యత్నించాడు. తన కోరిక నెరవేర్చుకోవడానికి వివాహిత భర్తపై అక్రమ కేసులు పెట్టాడు. స్టేషన్‌కు పిలిపించి చితక బాదాడు. అంతేకాదు బాధిత వివాహితపై బ్రోతల్ కేసు పెడతానంటూ ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ఇప్పుడు నేరస్తుడిగా మారి పరారీలో ఉన్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్‌, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. నేరస్తుల కోసం సెర్చ్ ఆపరేషన్లు చేసిన ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు కోసం ఇప్పుడు పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.  


ఈ ప్రకంపనలు కొనసాగుతోన్న సమయంలోనే మరో ఎస్సై బాగోతం వెలుగు చూసింది. తనపై హత్యాచారం చేశాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలతో మల్కాజ్ గిరి సీసీఎస్ ఎస్సై విజయ్ కుమార్‌పై రేప్ కేసు నమోదు అయింది. బాధిత యువతి మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్  స్టేషన్‌లో కేసు పెట్టారు. బాధిత యువతితో ముందుగా ప్రేమలో ఉన్న ఎస్సై విజయ్ కుమార్ ఆమెను కాకుండా మరో యువతిని 2014లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా తనతో రిలేషన్ షిప్ కొనసాగించాలంటూ వేధింపులకు గురి చేశాడు. బాధితురాలికి వచ్చిన సంబంధాలు సైతం చెడగొట్టాడు. రిలేషన్ షిప్ కొనసాగించకపోతే అసలు పెళ్లి కాకుండా చేస్తానంటూ భయపెట్టాడు. వేదింపులు అధికం కావడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించారు. 


హైదరాబాద్ పోలీసులపై అత్యాచారం కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశగా మారింది. నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసులే నేరస్తులుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

Read more