775 గ్రాముల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-23T16:14:12+05:30 IST

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 775 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు

775 గ్రాముల గంజాయి స్వాధీనం

ఐదుగురు నిందితుల అరెస్టు

హైదరాబాద్/అడ్డగుట్ట: గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 775 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నార్త్‌జోన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్‌ వివరాలు వెల్లడించారు. అంబర్‌పేట్‌ జిందాతిలిస్మాత్‌ ప్రాంతానికి చెందిన ఇంతియాజ్‌(21) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతడితోపాటు చిలకలగూడకు చెందిన మహ్మద్‌ సుల్తాన్‌, సయ్యద్‌ బషీర్‌, వారాసిగూడకు చెందిన రియాజ్‌ అహ్మద్‌ఖాన్‌, మహ్మద్‌ షలీబ్‌ఖాన్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఇతర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో కొంతకాలంగా విక్రయిస్తున్నారు. మహ్మద్‌ ఇంతియాజ్‌ ఓ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారించి వివరాలు సేకరించారు. నిఘా పెట్టిన పోలీసులు మిగతా వారిని కూడా పట్టుకున్నారు. వారి నుంచి 775 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంతియాజ్‌ పాత నేరస్థుడని, అతడిపై చిక్కడపల్లి, బేగంపేట, నల్లకుంట, ముషీరాబాద్‌, పంజాగుట్ట, కాచిగూడ పోలీ్‌సస్టేషన్లలో 22 కేసులున్నాయని డీసీపీ చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. 

Read more