వారి సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్: గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2022-07-18T23:02:20+05:30 IST

హైదరాబాద్: మహిళల సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్ (Mahila Darbar) నిర్వహిస్తున్నానని గవర్నర్ (Governor) తమిళిసై (Tamilisai) తెలిపారు. ఎవరితోనూ విబేధించి,

వారి సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: మహిళల సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్ (Mahila Darbar) నిర్వహిస్తున్నానని గవర్నర్ (Governor) తమిళిసై (Tamilisai) అన్నారు. జూలై 18వ తేదీ రాజ్ భవన్‌లో నిర్వహించిన ‘మహిళా దర్బార్‌’లో ఆమె మాట్లాడారు. ఎవరితోనూ విబేధించి, ఎవరికీ వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మహిళలు వినతిపత్రాలతో వస్తున్నారని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటన సమయంలో మాట్లాడిన క్లౌడ్ బరెస్ట్ గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. 


మహిళా దర్బార్‌లో జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే రాష్ట్ర మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకపొతే NCWకి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2022-07-18T23:02:20+05:30 IST