తక్కువ వడ్డీకి రుణాలు

ABN , First Publish Date - 2022-12-10T00:49:21+05:30 IST

ఎంఎ్‌సఎంఈ రుణాలతో పాటు అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ ఏఎ్‌స.రాజీవ్‌ తెలిపారు.

తక్కువ వడ్డీకి రుణాలు

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ ఏఎ్‌స.రాజీవ్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఎంఎ్‌సఎంఈ రుణాలతో పాటు అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ ఏఎ్‌స.రాజీవ్‌ తెలిపారు. శుక్రవారం కృష్ణానగర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జూబ్లీహిల్స్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ బ్రాంచ్‌ రాష్ట్రంలో 47వదని, నగరంలో 23వదని తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ నగరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ నగరాల్లో పెద్దఎత్తున లావాదేవీలున్నాయని తెలిపారు. గతేడాది మార్చి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.12,121 కోట్ల టర్నోవర్‌ సాధించామని, తెలంగాణలోనే రూ.11 వేల కోట్ల వ్యాపారం చేశామని తెలిపారు. మార్చి 23 వరకు రూ.15 వేల కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపారు. తెలంగాణలోని 24 జిల్లాల్లో జూబ్లీహిల్స్‌ శాఖతో కలిపి 47 బ్రాంచ్‌లయ్యాయని, మరో 9 జిల్లాలకు బ్రాంచ్‌లను విస్తరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 60 బ్రాంచ్‌లను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందుతామని వివరించారు. కార్యక్రమంలో జోనల్‌ మేనేజర్‌ ఆర్‌.జగన్‌మోహన్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ ఎండీ. షహజీబ్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ ఎం.ఫణీంద్ర, పలువురు ఏజీఎంలు, ముఖ్య కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు.

హోటల్‌లో రుణమేళా

బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఎ్‌సఎంఈ రుణమేళా నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన మేళాలో వివిధ కంపెనీలు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని బ్యాంకు ప్రతినిధులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇతర బ్యాంకుల్లో ఎంఎ్‌సఎంఈ రుణాలు తీసుకున్న వారు తమ బ్యాంకులోకి మార్పు చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలిస్తామని ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2022-12-10T00:49:23+05:30 IST