టీడీపీ నేతకు లోకేశ్‌ ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-12-30T03:29:58+05:30 IST

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపుర్‌ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి రాజేశ్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆర్థిక సాయం చేశారు.

టీడీపీ నేతకు లోకేశ్‌ ఆర్థిక సాయం

వైద్య ఖర్చులకు రూ.2 లక్షలు అందజేత

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కుత్బుల్లాపుర్‌ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు అట్లూరి రాజేశ్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆర్థిక సాయం చేశారు. రాజేశ్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలుకున్న లోకేశ్‌.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు సాయం అందించారు. స్పందించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రాజేశ్‌ ఖాతాకు రూ.5 లక్షలు బదిలీ చేసింది. ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాలని, చికిత్సకు మరో రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. కాగా, తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సహాయం చేయాలని రాజేశ్‌ భార్య పావని కోరారు. దాతలు 9848889839 నంబరులో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-30T03:29:58+05:30 IST

Read more