క్యాసినో కేసులో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ L.Ramana

ABN , First Publish Date - 2022-11-18T11:41:38+05:30 IST

క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సహా వెళ్లిన రమణను ఈడీ జూన్‌లో నేపాల్‌లో నిర్వహించిన బిగ్‌ డాడీ ఈవెంట్‌పై ప్రశ్నిస్తోంది.

క్యాసినో కేసులో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ L.Ramana

Hyderabad : క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సహా వెళ్లిన రమణను ఈడీ జూన్‌లో నేపాల్‌లో నిర్వహించిన బిగ్‌ డాడీ ఈవెంట్‌పై ప్రశ్నిస్తోంది. చికోటి ప్రవీణ్‌ నుంచి తనకు నేపాల్‌ ఈవెంట్‌కు ఆహ్వానం ఉందని.. కానీ తాను వెళ్లలేదని ఎల్‌.రమణ చెబుతున్నారు. నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఎల్‌.రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో కేసులో 18 మంది రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే తలసాని సోదరులతో పాటు వైసీపీ నేత గరునాథ్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వెగాస్ బై బిగ్ డాడీ పేరుతో స్పెషల్ ఈవెంట్స్‌‌ను చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. మే నెలలో కొన్ని చోట్ల, జూన్‌లో గోవా, నేపాల్‌లో.. భారీగా చికోటి ప్రవీణ్‌కుమార్‌ ఈవెంట్స్‌ నిర్వహించాడు. ఈ ఈవెంట్స్‌కు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

Updated Date - 2022-11-18T11:41:38+05:30 IST

Read more