నాపై కేటీఆర్‌ స్నేహితుడి దాడి : కేఏ పాల్‌

ABN , First Publish Date - 2022-09-11T05:42:42+05:30 IST

సిరిసిల్లలో తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది మంత్రి కేటీఆర్‌ స్నేహితుడు అనిల్‌రెడ్డి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు.

నాపై కేటీఆర్‌ స్నేహితుడి దాడి : కేఏ పాల్‌

అమీర్‌పేట, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది మంత్రి కేటీఆర్‌ స్నేహితుడు అనిల్‌రెడ్డి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. శనివారం అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  కేటీఆర్‌ వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.  అక్టోబర్‌ 2న ప్రపంచ శాంతి ర్యాలీ, బిజినెస్‌ సమ్మిట్‌ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించడం లేదన్నారు.  సోమవారం సంచలన నిర్ణయం ఉంటుందని తెలిపారు. 


Read more