రేవంత్‌పై వ్యాఖ్యలకు జడ్సన్‌ క్షమాపణ

ABN , First Publish Date - 2022-11-12T03:19:37+05:30 IST

పలు మీడియా ఛానళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ లిఖితపూర్వక క్షమాపణ తెలియజేశారు.

రేవంత్‌పై వ్యాఖ్యలకు జడ్సన్‌ క్షమాపణ

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పలు మీడియా ఛానళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ లిఖితపూర్వక క్షమాపణ తెలియజేశారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు తమకు సంతృప్తినిచ్చాయంటూ రేవంత్‌ అన్న మాటలను జడ్సన్‌ తప్పుపట్టారు. ఇది పార్టీ నియమావళికి విరుద్ధమని క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. శుక్రవారం జడ్సన్‌ గాంధీ భవన్‌లో క్రమశిక్షణా చర్యల కమిటీని కలసి లిఖితపూర్వక క్షమాపణ లేఖ సమర్పించారు.

Updated Date - 2022-11-12T03:19:37+05:30 IST

Read more