జేఎన్‌టీయూలో జాబ్‌ ఫెయిర్‌

ABN , First Publish Date - 2022-03-16T14:26:42+05:30 IST

జేఎన్‌టీయూ-హెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వర్సిటీ యూఐఐసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాబ్‌ ఫెయిర్‌ను వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కట్టా

జేఎన్‌టీయూలో జాబ్‌ ఫెయిర్‌

 నేడూ స్పాట్‌ ఇంటర్వ్యూలు

హైదరాబాద్/జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ-హెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వర్సిటీ యూఐఐసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాబ్‌ ఫెయిర్‌ను వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారిలు మంగళవారం ప్రారంభించారు. సోల్విక్స్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌,  డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ సహకారంతో నిర్వహిస్తున్న జాబ్‌ ఫెయిర్‌కు 20 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 150 కంపెనీల్లో 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 16న కూడా మేళా ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, డిజైన్‌కు సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా అభ్యర్థులు నేరుగా హాజరై కూడా స్పాట్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందవచ్చన్నారు. పెద్దసంఖ్యలో కంపెనీల ప్రతినిధులు తరలిరావడంతో ఇంటర్వ్యూలకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ గోవర్ధన్‌, రిజిస్ర్టార్‌ మంజూర్‌ హుస్సేన్‌, యూఐఐసీ డైరెక్టర్‌ సందిపాము తారాకళ్యాణి, డిప్యూటీ డైరెక్టర్‌ జ్యోతుల సురే్‌షకుమార్‌, సోల్విక్స్‌ సీఈవో పి.లక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T14:26:42+05:30 IST