రైతు బంధు ప్రచారం తప్ప.. వ్యవసాయ రాయితీలు నిలిపేశారు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-16T19:27:33+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రైతు బంధు ప్రచారం తప్ప.. వ్యవసాయ రాయితీలు నిలిపేశారు: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మండలిలో వ్యవసాయ సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. రైతు బంధు ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని, వ్యవసాయ రాయితీలు నిలిపేశారని విమర్శించారు. పంట రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ.35 వేలు మాత్రమే చేశారన్నారు. మిగిలిన అప్పు మాపీపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ధాన్యం సేకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలన్నారు. వ్యవసాయ సమస్యలపై కమిటీ వేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Read more