జామ్‌.. జామ్‌..

ABN , First Publish Date - 2022-12-12T00:52:44+05:30 IST

జామ్‌.. జామ్‌..

 జామ్‌.. జామ్‌..

దూసుకుపోయిన రేసింగ్‌ కారు

తిలకించిన హీరోలు రామ్‌చరణ్‌, నాగచైతన్య

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా రేసింగ్‌ ప్రియులకు ఆసక్తిని కలిగించిన ఇండియన్‌ రేసింగ్‌లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) తుదిదశ పోటీలు నగరంలో ఆదివారం ముగిశాయి. శనివారం రాత్రి చిరుజల్లులు పడటం, ఆదివారం ఉదయం నుంచే వరుణుడు దోబూచులాడటంతో ఓ దశలో రేస్‌ జరుగుతుందా అనే సందేహం కలిగింది కానీ, నిర్వాహక బృందం రేస్‌ నిర్వహణకు మొగ్గు చూపడంతో ఉదయం క్వాలిఫైయర్‌, సాయంత్రం చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. అయితే, వీక్షకుల గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. చివరిరోజు రేస్‌లో నటులు రామ్‌చరణ్‌, నాగచైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉపాసనతో కలిసి రేస్‌కు వచ్చిన రామ్‌చరణ్‌, రేసింగ్‌ టీమ్‌ యజమానులు, రేసర్లతో ముచ్చటించారు. లీగ్‌ ముగింపు వేడుకలలో భాగంగా సినీ సంగీత దర్శకుడు తమన్‌, డ్రమ్మర్‌ శివమణిలతో ప్రత్యేకంగా సంగీత కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-12-12T00:52:54+05:30 IST

Read more