లోపాలు సరిదిద్దుకోకుంటే కష్టమే

ABN , First Publish Date - 2022-11-17T04:03:14+05:30 IST

సంస్థాగత లోపాలను ఇప్పటికైనా సరిదిద్దుకోకుంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టడం కష్టమేనని కాంగ్రెస్‌ పార్టీ విధేయుల ఫోరం అభిప్రాయపడింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణను పొందుపరుస్తూ నివేదిక రూపొందించాలని నిర్ణయించింది.

లోపాలు సరిదిద్దుకోకుంటే కష్టమే

ఖర్గేను కలవాలని కాంగ్రెస్‌ విధేయుల ఫోరం నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సంస్థాగత లోపాలను ఇప్పటికైనా సరిదిద్దుకోకుంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టడం కష్టమేనని కాంగ్రెస్‌ పార్టీ విధేయుల ఫోరం అభిప్రాయపడింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణను పొందుపరుస్తూ నివేదిక రూపొందించాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆ నివేదిక సమర్పించాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్‌ నేతలు మర్రి శశిథర్‌రెడ్డి, వి. హన్మంతరావు, కోదండరెడ్డి, బి. కమలాకర్‌, నిరంజన్‌, శ్యామ్‌ మోహన్‌ తదితరులు కాంగ్రెస్‌ విధేయుల ఫోరంగా ఏర్పడి తరచూ సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఫలితం నేపథ్యంలో మంగళవారం రాత్రి వీరు సమావేశమయ్యారు. గతంలో తాము చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటే.. పార్టీకి అనుకూల పరిస్థితులు ఉండేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వరుస ఓటములతో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినడం, కాంగ్రెస్‌ పనైపోయిందంటూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రచారం చేయడం.. ప్రభావం చూపుతోందని వారు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-11-17T04:03:15+05:30 IST