Inorbit Mall: ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023 శిక్షణ కార్యక్రమం.. పాల్గొన్న 500 మంది రన్నర్లు

ABN , First Publish Date - 2022-11-24T19:15:32+05:30 IST

శిక్షణ ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మారథాన్ కోసం దుర్గం చెరువు

 Inorbit Mall: ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023 శిక్షణ కార్యక్రమం.. పాల్గొన్న 500 మంది రన్నర్లు
inorbit durgam cheruvu run

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జనవరి 29న మూడో ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023 (Inorbit Durgam Cheruvu Run 2023) జరగనుంది. ఈ మారథాన్‌ కోసం నిర్వహించిన ‘ఆన్‌ ద స్పాట్’ రిజిస్ట్రేషన్లకు అపూర్వ స్పందన లభించింది. శిక్షణ ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మారథాన్ కోసం దుర్గం చెరువు చుట్టూ ఉన్న 4.4 కిలోమీటర్ల ట్రాక్‌పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి 500 మందికిపైగా రన్నర్లు పాల్గొన్నారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రెండో ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ కోసం 3 వేలమందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ ఏడాది 5 కిలోమీటర్ల రన్‌, 10 కిలోమీటర్‌ రన్‌తో పాటుగా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌ కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్లలో భాగంగా తీసుకొచ్చిన ‘ఎర్లీబర్డ్’ ఆఫర్‌ను ఈ నెల 30 వరకు పొడిగించారు. 5కె రన్‌ కోసం రూ. 599, 10కె రన్ కోసం రూ. 1099, రూ. 21కె రన్ కోసం రూ.1399గా టికెట్ ధరలను నిర్ణయించారు.

Updated Date - 2022-11-24T19:15:32+05:30 IST

Read more