మహిళతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి మూడు రోజుల జైలు

ABN , First Publish Date - 2022-08-18T05:27:47+05:30 IST

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి న్యూసెన్స్‌ చేసిన వ్యక్తికి నాంపల్లిలోని 7వ స్పెషల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ 3రోజుల జైలు శిక్ష విధించారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌

మహిళతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి మూడు రోజుల జైలు

చాదర్‌ఘాట్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మహిళతో అసభ్యంగా ప్రవర్తించి న్యూసెన్స్‌ చేసిన వ్యక్తికి నాంపల్లిలోని 7వ స్పెషల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ 3రోజుల జైలు శిక్ష విధించారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌లోని పద్మావతి కళాశాల సమీపంలో నివాసముంటున్న గుంజి వెంకటేశ్‌(38) మేస్త్రీ, ఇటీవల మహిళతో అసభ్యంగా ప్రవర్తించి న్యూసెన్స్‌ చేస్తున్నట్లుగా మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు గుంజి వెంకటేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నాంపల్లిలోని 7వ స్పెషల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ 3రోజుల జైలు శిక్ష విధించారు. 


మరో ఇద్దరికి..


మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులకు నాంపల్లిలోని 7వ స్పెషల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ 3రోజుల జైలు శిక్ష విధించింది. అంబర్‌పేట నివాసి రాజే్‌షసింగ్‌ రాజ్‌పుత్‌, టి.సాయికృష్ణ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు అందిన ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. విచారణ జరిపిన నాంపల్లిలోని 7వ స్పెషల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ రాజే్‌షసింగ్‌, సాయికృష్ణలకు 3రోజుల జైలు శిక్ష విధించింది. 

Read more