Murder: గుండ్లపోచంపల్లిలో వ్యక్తి దారుణ హత్య..

ABN , First Publish Date - 2022-08-01T17:16:46+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

Murder: గుండ్లపోచంపల్లిలో వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్ (Hyderabad): పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్లపోచంపల్లిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య (Murder)చేశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన‌ బాబు(40)గా గుర్తించారు. మృతుని తలపై బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-01T17:16:46+05:30 IST