రెండో రోజు సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న పీకే

ABN , First Publish Date - 2022-04-24T16:12:22+05:30 IST

సీఎం కేసీఆర్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆదివారం కూడా సమావేశం కానున్నారు.

రెండో రోజు సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న పీకే

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆదివారం కూడా సమావేశం కానున్నారు. శనివారం రోజంతా అక్కడే ఉండి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున వ్యూహ కర్తగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్‌లో చేరేందుకు కొద్ది రోజులుగా సోనియాతో పలుమార్లు పీకే భేటీ అయ్యారు. ఈ క్రమంలో పీకే సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


పీకే శనివారం రోజంతా సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఇప్పటికే ప్రగతి భవన్‌లో ఉన్న పీకే ఇవాళ కూడా గులాబీ బాస్‌తో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికలకు కలిసి పనిచేయడంపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ వ్యూహకర్తగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరిందని సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కున్నా ముందే టీఆర్ఎస్ కోసం పని చేసేందుకు పీకే అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. కేసీఆరే స్వయంగా పీకేతో పనిచేస్తున్నామని చెప్పారు కూడా. ఇప్పటికే పీకే ఒకసారి తెలంగాణకు వచ్చి వెళ్లారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పరిస్థితులపై సర్వే జరిపి నివేదిక కూడా సమర్పించారు. కాగా సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశంపై రాజకీయాల వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read more