రాఘవేందర్ రాజు, మున్నూరు రవిలను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

ABN , First Publish Date - 2022-03-16T20:01:45+05:30 IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రాఘవేందర్ రాజు, మున్నూరు రవిలను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిందితులను ఐదు రోజులు కస్టడీకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు విచారించిన ఎలాంటి సమాచారం రాకపోవడంతో మరోసారి మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ1 రాఘవేందర్ రాజు, ఏ5 మున్నూరు రవిలను మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించనుంది. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో గురువారం తీర్పు ఇవ్వనుంది.


మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు  హత్యకు ఏ విధంగా కుట్ర చేశారన్నదానిపై లోతైన విచారణ జరిపారు. మిగతా వారి ప్రమేయంపై కూడా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే జితేందర్ రెడ్డి డ్రైవర్‌కు న్యాయస్థానం బెయల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more