హైదరాబాద్: చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-02-16T19:30:04+05:30 IST

హైదరాబాద్: చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టారు.

హైదరాబాద్: చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాలు

హైదరాబాద్: చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనలో లోపలి మెట్లు బయటపడ్డాయి. అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడ్డాయంటూ ప్రచారం జరగడంతో అక్కడికి చేరుకున్న మజ్లిస్ నేతలు తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అనుమతి ఇచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. తర్వాత కూడా ఇక్కడ తవ్వకాలు జరపవద్దని ఎంఐఎం నేతలు అధికారులతో అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ అధికారులు కావాలనే తవ్వకాలు చేస్తున్నారని మజ్లిస్ నేతలు ఆరోపించారు.

Updated Date - 2022-02-16T19:30:04+05:30 IST