మొబైల్‌ చూస్తూ..సంప్‌లో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-07-18T18:15:53+05:30 IST

మొబైల్‌ చూస్తూ నీటి సంప్‌లో పడి చిన్నారి మృతి చెందాడు. నార్సింగ్‌ ఏఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. మధుచారి, కృష్ణవేణిల

మొబైల్‌ చూస్తూ..సంప్‌లో పడి చిన్నారి మృతి

హైదరాబాద్/నార్సింగ్‌ : మొబైల్‌ చూస్తూ నీటి సంప్‌లో పడి చిన్నారి మృతి చెందాడు. నార్సింగ్‌ ఏఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. మధుచారి, కృష్ణవేణిల ఏకైక కుమారుడు రాము (5). మధుచారి  కార్పెంటర్‌. శనివారం సాయంత్రం నల్లా రావడంతో నీరు పట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఈ క్రమంలో రాముకు ఫోన్‌ ఇచ్చారు. రాము మొబైల్‌ చూస్తూ ఇంట్లోని నీటి సంప్‌లో పడిపోయాడు. కొద్ది సేపటికి గమనించిన తల్లిదండ్రులు బాలుడిని బయటకు తీశారు. అపస్మాకర స్థితిలో ఉండడంతో నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Read more