బస్టాప్‌లోకి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2022-06-07T13:57:11+05:30 IST

కారు అదుపు తప్పి బస్టా్‌పలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున

బస్టాప్‌లోకి దూసుకెళ్లిన కారు

వ్యక్తికి గాయాలు

హైదరాబాద్/ఖైరతాబాద్‌: కారు అదుపు తప్పి బస్టా్‌పలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో స్కోడా కారు ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి రోటరీ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా తెలుగు తల్లి చౌరస్తా వైపు వెళ్తూ అదుపు తప్పి ఎన్టీఆర్‌ ఘాట్‌ ఎదుట ఉన్న బస్టా్‌పలోకి దూసుకెళ్లింది. బస్టా్‌పలో కూర్చున్న సత్యనారాయణ(50) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారును మహాలక్ష్మి అనే మహిళ డ్రైవ్‌ చేస్తున్నారని, ఆమెతోపాటు మరో మహిళ వాహనంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితుడి కుమారుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more