పల్లె నుంచి పట్నానికి..

ABN , First Publish Date - 2022-10-08T18:03:04+05:30 IST

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాటపడుతున్నారు. జిల్లాలకు వెళ్లిన లక్షల

పల్లె నుంచి పట్నానికి..

బస్టాండ్ల నుంచి ఇళ్లకు చేరేందుకు కనిపించని సిటీ బస్సులు

హైదరాబాద్‌ సిటీ: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాటపడుతున్నారు. జిల్లాలకు వెళ్లిన లక్షల మంది తిరిగి చేరుకుంటుండంతో శుక్రవారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు, సీబీఎస్‌ రద్దీగా మారాయి. బస్టాండ్లలో కుటుంబ సభ్యులతో దిగిన ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిటీ బస్సులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జేబీఎస్‌ నుంచి యూసు్‌ఫగూడకు ఆటోలో వెళ్లేందుకు రూ. 300-350 చార్జీ వసూలు చేస్తున్నారని యూసు్‌ఫగూడకు చెందిన సౌజన్య అన్నారు.

Read more