నిమజ్జన కొలనుల వద్ద వాటర్‌ క్యాంపులు

ABN , First Publish Date - 2022-08-31T15:46:41+05:30 IST

వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, నిమజ్జనాల కోసం ఏర్పాటు

నిమజ్జన కొలనుల వద్ద వాటర్‌ క్యాంపులు

హైదరాబాద్‌ సిటీ: వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసే కొలనుల వద్ద వాటర్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఎండీ దానకిశోర్‌ తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్‌ మాట్లాడుతూ.. గతంలో కేవలం ప్రధాన నిమజ్జన ఘట్టమైన 11వ రోజున మాత్రమే వాటర్‌ క్యాంపులు ఉండేవని, ఈసారి మాత్రం 3, 5, 7, 9 రోజుల్లో సైతం వాటర్‌ క్యాంపులుంటాయని చెప్పారు. మండపాల వద్ద సివరేజీ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో వాటర్‌బోర్డు డైరెక్టర్‌లు వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌, అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

Read more