రూ. 5.37లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-23T18:02:05+05:30 IST

గుట్కా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల నుంచి తరలించి ఇక్కడ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి

రూ. 5.37లక్షల విలువైన గుట్కా స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: గుట్కా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల నుంచి తరలించి ఇక్కడ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ రాష్ర్టానికి చెందిన మానక్‌ కుమావత్‌ (28), ప్రకాశ్‌ కుమావత్‌ (28) అల్వాల్‌లో నివాసముంటూ కర్ణాటక రాష్ట్రం బీదర్‌నుంచి గుట్కా ఉత్పత్తులను అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌ వాసి సోహన్‌లాల్‌ (46)కు చెందిన గూడ్సు వాహనాలలో గుట్కాను తరలిస్తుండగా బొల్లారం బజార్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. రెండు ఆటోలు (టీఎస్‌11 యూఏ 8066, ఏపీ11వై 7593), ఓ ద్విచక్ర వాహనాన్ని (టీఎస్‌ 08హెచ్‌వి-1762) స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాల్లో రూ.5.37 లక్షలు విలువ చేసే పలు బ్రాండ్ల గుట్కా ఉత్పత్తులు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురితోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి విచారణ నిమిత్తం బొల్లారం పీఎ్‌సకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. 

Read more