భార్యపై భర్త దాడి

ABN , First Publish Date - 2022-07-18T16:40:07+05:30 IST

భార్యపై దాడిచేశాడో వ్యక్తి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీకి చెందిన అతీఫ్‌ అన్సారీ ఆరునెలల క్రితం మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన

భార్యపై భర్త దాడి

హైదరాబాద్/బంజారాహిల్స్‌: భార్యపై దాడిచేశాడో వ్యక్తి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీకి చెందిన అతీఫ్‌ అన్సారీ ఆరునెలల క్రితం మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన నస్రాసిద్దిఖీని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన నెలరోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అన్సారీ వేధింపులు భరించలేక సిద్దిఖీ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నెల 16న ఔరంగాబాద్‌ నుంచి సిద్దఖీ తండ్రి మొయినుద్దీన్‌తోపాటు ఇద్దరు సోదరులు వచ్చారు. కూర్చొని సమస్య పరిష్కరించుకుందామని అల్లుడికి చెప్పాడు. మాట్లాడుతుండగానే అన్సారీ ఆగ్రహంతో భార్యను గదిలోకి లాక్కెళ్లి దాడిచేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more