భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-30T16:58:46+05:30 IST

భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. లంగర్‌హౌజ్‌లో నివాసముండే కాంత రమే్‌ష(లేట్‌), మంగ దంపతులకు

భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్/బాలానగర్‌: భర్త వేధింపులు తాళలేక గృహిణి  ఆత్మహత్యకు పాల్పడింది. లంగర్‌హౌజ్‌లో నివాసముండే కాంత రమే్‌ష(లేట్‌), మంగ దంపతులకు ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అశ్విని(32)కి 2015లో  పద్మానగర్‌ ఫేజ్‌-1కు చెందిన విష్ణుతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విష్ణు భార్యను ఎప్పుడు అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండే వాడు. బుధవారం రాత్రి తన అక్క ఇంటికి వెళ్దామని భార్యతో గొడవపడిన విష్ణు ఆమె రాకపోవడంతో ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పద్మానగర్‌ ఫేజ్‌-1లో ఉన్న తన సోదరి రేవతి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం అశ్వినికి తల్లి ఫోన్‌ ఎన్ని సార్లు చేసిన  ఎత్తక పోవడంతో కొడుకు మహే్‌షను పద్మారావునగర్‌కు పంపింది. విష్ణు ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే చెల్లి అశ్విని కిటికీ కర్టెన్‌ హుక్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె మరణానికి అల్లుడు విష్ణు కారణమని పేర్కొంటు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాలానగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more