హాస్టల్‌ వసతి కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-19T02:42:19+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలోని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వెంటనే హాస్టల్‌ వసతి కల్పించాలన్న డిమాండ్‌తో శుక్రవారం విద్యార్థులు ఓయూ పరిపాలన భవనాన్ని ముట్టడించారు.

 హాస్టల్‌ వసతి కల్పించాలి

ఓయూ ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌’ విద్యార్థుల డిమాండ్‌

తార్నాక, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీలోని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వెంటనే హాస్టల్‌ వసతి కల్పించాలన్న డిమాండ్‌తో శుక్రవారం విద్యార్థులు ఓయూ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. భవనంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసేయగా.. విద్యార్థులు గేటు దూకి భవనంలోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. తాము కాలేజీల్లో చేరి రెండు నెలలు గడుస్తున్నాయని, ఇప్పటికీ తమకు హాస్టల్‌ వసతి కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. ఓయూ వీసీ స్పందించి తక్షణమే హాస్టల్‌ వసతిని కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-19T02:42:19+05:30 IST

Read more