పండ్ల మార్కెట్ ఖాళీ చేయండి: హైకోర్టు
ABN , First Publish Date - 2022-03-16T15:48:15+05:30 IST
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపునకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో పలువురు అధికారులు వ్యక్తిగతంగా మంగళవారం

ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన అధికారులు
హైదరాబాద్: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపునకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో పలువురు అధికారులు వ్యక్తిగతంగా మంగళవారం హైకోర్టుకు హాజరయ్యారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మ హర్ష, మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్‌ఛార్జి లక్ష్మణుడు, కార్యదర్శి నర్సింహారెడ్డిలు కోర్టుకు వచ్చారు. వ్యాపారులు, ఏజెంట్లు తమ సామగ్రి తరలించుకునేందుకు అధికారులు అనుమతించాలని హైకోర్టు పేర్కొంది. ఈనెల 18 నాటికి మొత్తం ఖాళీ చేయాలని కమిషన్ ఏజెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.