18 నుంచి ఆరోగ్య మేళాలు

ABN , First Publish Date - 2022-04-05T15:52:46+05:30 IST

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఐదు రోజులపాటు ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

18 నుంచి ఆరోగ్య మేళాలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఐదు రోజులపాటు ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రతి మండలంలో ఒక ఆరోగ్య మేళా చొప్పున 16 మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఆరోగ్యమేళాలో 21 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, ఆయుష్‌, యునానీ వైద్యాధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై పలు రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వంద శాతం లక్ష్యాలను సాధిస్తామన్నారు. అడిషనల్‌ జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నిర్మల ప్రభావతి, డాక్టర్‌ జయమాలిని, డీఐఓ డాక్టర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు. 

Read more