Hyderabad: డబ్బు చెల్లించమన్నందుకు చంపేశాడు

ABN , First Publish Date - 2022-12-30T12:19:15+05:30 IST

తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ మహిళను కిరాతకంగా హతమార్చిన వ్యక్తిని, అతడిచ్చిన బంగారాన్ని దాచిన మహిళను బాలాపూర్‌

Hyderabad: డబ్బు చెల్లించమన్నందుకు చంపేశాడు

హైదరాబాద్/పహాడిషరీఫ్‌: తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ మహిళను కిరాతకంగా హతమార్చిన వ్యక్తిని, అతడిచ్చిన బంగారాన్ని దాచిన మహిళను బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 74 గ్రాముల బంగారు నగలు, 1335 గ్రాముల వెండి నగలు, గొడ్డలి, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీం సిబ్బంది హత్య జరిగిన ప్రాంతంలో ఎముకలు, శరీర భాగాలు, బూడిద స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌, రెడ్డి కాలనీకి చెందిన బొర్రా బాలమ్మ అక్ట్టోబర్‌ 10న హత్యకు గురైంది. ఆమె కుమారుడు బొర్రా బాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన ఇంటి పక్కనే ఉంటున్న నెల్లికంటి రాములుపై అనుమానం వ్యక్తం చేశాడు. దర్యాప్తులో భాగంగా డిసెంబర్‌ 24న రాములును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా బాలమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బాలమ్మ వద్ద రూ. 10 వేలు అప్పుగా తీసుకున్నానని, డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో మల్లాపూర్‌ వద్ద గొడ్డలితో బాలమ్మ గొంతు నరికి చంపానని, అనంతరం శవాన్ని చిన్న ముక్కలుగా చేసి వరి చెత్తలో కాల్చేశానని, కొన్ని శరీర భాగాలను డ్రైనేజీలో పడేశానని నిందితుడు రాములు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-30T12:19:15+05:30 IST

Read more