నారా లోకేశ్‌తో జ్ఞానేశ్వర్‌ భేటీ

ABN , First Publish Date - 2022-11-24T03:37:12+05:30 IST

టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు.

నారా లోకేశ్‌తో జ్ఞానేశ్వర్‌ భేటీ

హైదరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోకేశ్‌ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వార్డు అభ్యర్థులను, సర్పంచ్‌ అభ్యర్థులను ముందుగానే నిర్ణయించి ప్రజల్లోకి వెళతామని ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌ సమీక్షలో జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు. చేవెళ్ల నుంచి ఈ పద్ధతికి నాంది పలుకుతున్నామని తెలిపారు. అంతేకాక, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని కాసాని వెల్లడించారు.

Updated Date - 2022-11-24T03:37:18+05:30 IST

Read more