తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరికి రూ. లక్ష ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2022-11-23T00:18:29+05:30 IST

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన కృష్ణవేణి, స్పందనకు యెగ్గె మల్లేశం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం కురుమ అందజేశారు.

తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరికి రూ. లక్ష ఆర్థిక సహాయం

అఫ్జల్‌గంజ్‌, నవంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన కృష్ణవేణి, స్పందనకు యెగ్గె మల్లేశం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం కురుమ అందజేశారు. దసరా-దీపావళి సమ్మేళనాన్ని పురస్కరించుకొని కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌ఎం.రేవన్న, రాష్ట్ర నాయకులు కొలుపుల నర్సింహా, జంట నగరాల కురుమ సంఘం అధ్యక్షుడు నర్స వినోద్‌కుమార్‌, యూత్‌ అధ్యక్షులు తూంకుంట అరుణ్‌ కుమార్‌, పసుపరి శంకర్‌తో కలిసి వారిద్దరికి ఆర్థిక సహాయా న్ని అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన జాతరకొండ ఓదేలు, జాతరకొండ రజిత దంపతులు. వీరికి కృష్ణవేణి, స్పందన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. పొలం పనులు చేస్తుండగా... తెగిపడిన విద్యుత్‌ తీగలను గమనించని ఓదేలు విద్యుత్‌షాక్‌తో పడిపోయాడు. భర్తను రక్షించడానికి వెళ్లిన భార్య రజిత సైతం షాక్‌కు గురైం ది. ఈ విషయం తెలియడంతో వెంటనే వారికి ఆర్థిక సహా యం చేసేందుకు తాను రూ. లక్ష నగదును అందజేశానని.. త్వరలో ట్రస్టు సభ్యులు, కురుమ కుల పెద్దలు కూడా తమ వంతు సహాయంగా నగదును అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని.. ఆ నగదును కూడా త్వరలో బాధితురాలకు అందజేస్తామని యెగ్గె మల్లేశం తెలిపారు. అనంతరం కురుమ కులస్థుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు జియగూడ కురుమ సంఘం అధ్యక్షుడు ఎం.నర్సింహా చేస్తున్న కృషి అభినందనీయమని యెగ్గె మల్లేశం అభినందించి జ్ఞాపికతో సత్కరించారు.

సమ్మేళనం సక్సెస్‌

బండ్లగూడలోని ఆరె మైసమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన 44వ దసరా-దీపావళి సమ్మేళనానికి నగర నలుమూలల నుంచి కురుమ కులస్థులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర కురుమ సంఘం తరఫున నగర సంఘం అధ్యక్షుడు నర్స వినోద్‌కుమార్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-11-23T00:18:29+05:30 IST

Read more