18 వరకే బాణసంచా విక్రయాల లైసెన్సులకు గడువు

ABN , First Publish Date - 2022-10-03T16:26:13+05:30 IST

దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా షాపులను ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల నుంచి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీఆనంద్‌

18 వరకే బాణసంచా విక్రయాల లైసెన్సులకు గడువు

హైదరాబాద్‌ సిటీ: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా షాపులను ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల నుంచి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీఆనంద్‌ ప్రకటించారు. ప్రతిజోన్‌లో డీసీపీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చన్నారు. పూర్తిచేసిన ఫారాలను ఈనెల 18లోపు కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత దరఖాస్తు ఫారాలను స్వీకరించరని తెలిపారు. దరఖాస్తు ఫారాలతో పాటు డివిజనల్‌ ఫైర్‌ అధికారితో ఎన్‌ఓసీ, ప్రభుత్వ స్థలంలో షాపులు ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి ఉండాలని, ప్రైవేటు స్థలాల్లో స్థల యజమానులతో అనుమతి పత్రం, గతేడాది లైసెన్సు జారీ అయి ఉంటే దాని కాపీ జతచేయాలని సూచించారు. సింగిల్‌ షాపు ఉంటే స్థానికుల నుంచి ఎన్‌ఓసీ, షాపు బ్లూప్రింట్‌ కాపీ, లైసెన్సు ఫీజు రూ.600 (ఎస్‌బీఐ, గన్‌ఫౌండ్రీ శాఖలో) చెల్లించిన రసీదు జతపరచాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2022-10-03T16:26:13+05:30 IST