సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు..

ABN , First Publish Date - 2022-07-19T05:16:26+05:30 IST

నగర శివారులోని దుండిగల్‌ మర్రి లక్ష్మణరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌, ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ కళాశాలల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది.

సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు..
వీఎన్‌ఆర్‌ కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

 ఎంసెట్‌ పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

 సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు 

 రోడ్లపైనే పడిగాపులు

దుండిగల్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని దుండిగల్‌ మర్రి లక్ష్మణరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌, ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ కళాశాలల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా  ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే పరీక్షల సమయం కంటే ముందుగానే  తల్లిదండ్రులతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.  ఆయా పరీక్షా సెంటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.  విద్యార్థుల హాల్‌ టికెట్లను ఇన్విజ్‌లేటర్లు చెక్‌ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. గతంలో ఎంసెట్‌ పరీక్షా కేంద్రాల వద్ద నీటి సౌకర్యం, టెంట్లు ఏర్పాటుచేశారు. కానీ ఈసారి ఎక్కడా కూడా అలాంటి సౌకర్యాలు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. 

Read more