Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు..

ABN , First Publish Date - 2022-10-01T16:13:55+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ మందు పోలీసులకు షాక్ ఇచ్చాడు.

Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు..

హైదరాబాద్ (Hyderabad): నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ మందుబాబు పోలీసులకు షాక్ ఇచ్చాడు. రాజీవ్ చౌక్ వద్ద మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు ఆపారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే వంటిపై ఉన్న బట్టలు విప్పేశాడు. బూతు పురాణం అందుకున్నాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. మందుబాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను వినకపోవడంతో వెంటనే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే మందుబాబు కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వాహనాన్ని సీజ్ చేసి అతనిని వదిలేసినట్లుగా సమాచారం. అయితే ట్రాఫిక్ పోలీసులు మందుబాబును రెచ్చగొట్టడంతో ఇలా జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Read more