కేసీఆర్‌ చేతిలో మళ్లీ మళ్లీ మోసపోవద్దు

ABN , First Publish Date - 2022-11-03T05:12:33+05:30 IST

‘‘ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాయమాటలు నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు.

కేసీఆర్‌ చేతిలో మళ్లీ మళ్లీ మోసపోవద్దు

ఓటును అమ్ముకోకుండా పనిచేసే వాళ్లకే వేయండి: షర్మిల జగిత్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాయమాటలు నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటును అమ్ముకోవద్దు. పనిచేసే నాయకులకు ఓటు వేసి ఎన్నుకోవాలి’’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని తిప్పన్నపేట, పొలాస, అనంతారం, తక్కలపల్లి, కల్లెడ, ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌, నేరేళ్ల గ్రామాల్లో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆమె పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క మాటైనా సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సాఆర్‌టీపీని ప్రజలు ఆశీర్వదిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని, మహిళలను ఆర్థికంగా నిలబెడుతామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-11-03T05:12:33+05:30 IST
Read more