ముదిరాజ్‌లను ‘బీసీ ఏ’లో చేర్చొద్దు

ABN , First Publish Date - 2022-12-10T00:37:46+05:30 IST

ముదిరాజ్‌ కులస్థులను బీసీ ఏ గ్రూప్‌లో చేర్చి బీసీ ఏ గ్రూప్‌లో ఉన్న కులాలకు అన్యాయం చేయొద్దని బీసీ ఏ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు ఏఎస్‌ మల్లయ్య ప్రొఫెసర్‌ బాగయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మానస గణే్‌ష కోరారు.

ముదిరాజ్‌లను ‘బీసీ ఏ’లో చేర్చొద్దు

మంగళ్‌హాట్‌, డిసెంబర్‌ 9(ఆంధ్రజ్యోతి): ముదిరాజ్‌ కులస్థులను బీసీ ఏ గ్రూప్‌లో చేర్చి బీసీ ఏ గ్రూప్‌లో ఉన్న కులాలకు అన్యాయం చేయొద్దని బీసీ ఏ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు ఏఎస్‌ మల్లయ్య ప్రొఫెసర్‌ బాగయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మానస గణే్‌ష కోరారు. శుక్రవారం బీపీ గన్‌ఫౌండ్రీ డివిజన్‌ సాదికారత భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్థిక, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ముదిరాజ్‌ కులాన్ని బీసీ ఏ గ్రూప్‌లో చేర్చితే 56 కులాలకు నష్టం జరుగుతుందని వారు వాపోయారు. గ్రేటర్‌లోని బీసీ ఏ కులాలను ఏకం చేసేందుకు చంద్రశేఖర్‌, ధన్‌రాజ్‌, రాములు, హరిశంకర్‌, బాలయ్య, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, జంగయ్య, శివరాజ్‌, చిత్తరంజన్‌, రామేష్‌, వెంకటేష్‌, యాదగిరి, లక్ష్మీనారాయణతో కూడిన అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమిటీ సభ్యులు నగరంలోని బీసీ ఏ గ్రూప్‌ కులాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ ఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి, కోశాధికారి అబ్బు లింగం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీరాస్వామి, ఉపాధ్యక్షుడు సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:37:46+05:30 IST

Read more