పన్ను చెల్లింపులో రాయితీ

ABN , First Publish Date - 2022-04-05T14:51:28+05:30 IST

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ఇప్పుడు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ..

పన్ను చెల్లింపులో రాయితీ

ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ఇప్పుడు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్ను ఈ నెలాఖరులోపు చెల్లిస్తే రాయితీ వర్తించనుంది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 సవరణలో భాగంగా 2013 నుంచి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని, గత బకాయిలకు రాయితీ ఉండదని అధికారులు పేర్కొన్నారు.

Read more