తెలంగాణ అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు నమూనా

ABN , First Publish Date - 2022-11-12T00:45:46+05:30 IST

ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధితో, ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు జి.ఆర్‌.రెడ్డి అన్నారు.

తెలంగాణ అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు నమూనా

చార్మినార్‌, నవంబర్‌ 11(ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధితో, ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు జి.ఆర్‌.రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ సిటీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం స్వయం సమృద్ధి సాధించి అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగటమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఒక అభివృద్ధి మోడల్‌గా నిలిచిందన్నారు. ప న్నుల సేకరణలో 2021లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఆచార్య ఇంద్ర కాంత్‌, కోపరేటివ్‌ బాంక్‌ మాజీ ఎండీ జగన్మోహన్‌ రావు, మద్రాస్‌ ఎతిరాజ్‌ కాలేజీ నుంచి డా.సునీల శామ్‌, డా.విజయ రాఘవి, డా.ఎం.బి.హరి కిషన్‌, డా.విజయ నిర్మల, డా.పద్మ అనూరాధ పత్రం సమర్పణ చేశారు. సమన్వయకర్తలు డా.పావని, డా.కృష్ణ వేణి, శ్రీమతి లతారాణి సదస్సుని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృంధాన్ని అభినందించారు.

Updated Date - 2022-11-12T00:45:47+05:30 IST