నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..సీపీ వార్నింగ్‌

ABN , First Publish Date - 2022-09-25T16:31:05+05:30 IST

నిబంధనలు అతిక్రమించి పబ్‌లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. ఈ మేరకు సైబరాబాద్‌

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..సీపీ వార్నింగ్‌

హైదరాబాద్‌ సిటీ: నిబంధనలు అతిక్రమించి పబ్‌లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. ఈ మేరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పబ్‌ నిర్వాహకులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలకు, లైసెన్స్‌ నిబంధనలకు లోబడి పబ్‌లు నిర్వహించుకోవాలన్నారు. రాత్రి పది దాటిన తర్వాత పబ్‌ల నుంచి శబ్దం బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చి బ్యాక్‌ అప్‌ సేవ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు, పబ్‌ల యాజమానులు పాల్గొన్నారు.  

Read more