యువకుడిపై దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-01T05:44:43+05:30 IST

యువకుడిపై దాడిచేసి ఫోన్‌ లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యువకుడిపై దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్‌

బౌద్ధనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): యువకుడిపై దాడిచేసి ఫోన్‌ లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్‌ రియాజ్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున మెట్టుగూడలో ఫుడ్‌ డెలివరీ ఇచ్చి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. మెట్రో స్టేషన్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు ఐస్‌క్రీమ్‌ అమ్మే వ్యక్తితో గొడవపడుతున్నారు. రియాజ్‌ వారిని అడ్డుకున్నాడు. అక్కడి నుంచి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించారు. ఆలుగడ్డబావి సిగ్నల్స్‌ వద్ద దాడిచేసి రూ. 12 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బైక్‌ నెంబర్‌, సీసీ ఫుటేజీల ఆధారంగా మెట్టుగూడకు చెందిన డేనియల్‌ జోసెఫ్‌, బోయిగూడకు చెందిన కెస్టర్‌ హారీని గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

Read more