అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-11-08T00:37:39+05:30 IST

ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ సంజీవరావు ఆదేశాల మేరకు ఆర్‌ఐ పరమేశ్వర్‌రెడ్డి, సిబ్బంది ఎక్సకవేటర్‌ సహాయంతో

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

దుండిగల్‌, నవంబర్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ సంజీవరావు ఆదేశాల మేరకు ఆర్‌ఐ పరమేశ్వర్‌రెడ్డి, సిబ్బంది ఎక్సకవేటర్‌ సహాయంతో సోమవారం ఉదయం కూల్చివేశారు. గాజులరామారంలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్లు 342, 329/1లలో వెలిసిన అక్రమ నిర్మాణాల్లో 40 రూమ్‌లు, 10 బేసుమెంట్లను కూల్చివేశారు. గత నెల 29న కబ్జాచెరలో ప్రభుత్వ భూమి అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌, రెవెన్యూ యంత్రాంగం స్పందించి అప్పటి నుంచి ప్రతి రెండు రోజులకొకసారి అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తూనే ఉన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కబ్జాదారుల లిస్టు తయారు చేయగా స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వారిపై పీడీయాక్ట్‌ పెట్టడానికి పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తుంది.

Updated Date - 2022-11-08T00:37:39+05:30 IST

Read more