బీజేపీ కంటే సీపీఐ బలంగా ఉంది: కూనంనేని

ABN , First Publish Date - 2022-12-13T03:38:34+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ కంటే సీపీఐకే బలమైన నాయకత్వం, ఓటు బ్యాంకు ఉందని, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో పాల్గొంటే, తమ బలమేంటో నిరూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ...

బీజేపీ కంటే సీపీఐ బలంగా ఉంది: కూనంనేని

ఖమ్మం సంక్షేమ విభాగం, డిసెంబరు 12: రాష్ట్రంలో బీజేపీ కంటే సీపీఐకే బలమైన నాయకత్వం, ఓటు బ్యాంకు ఉందని, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో పాల్గొంటే, తమ బలమేంటో నిరూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం ఖమ్మం వర్తకసంఘం భవనంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎ్‌సతో పొత్తు ఎన్నికల వరకేనని, సాధారణ సమయంలో సీపీఐ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు.

Updated Date - 2022-12-13T03:38:34+05:30 IST

Read more