1,372 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2022-01-28T16:12:10+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గురువారం 1,372 మందికి వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నిర్వహించిన ఫీవర్‌

1,372 మందికి వైరస్‌

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో గురువారం 1,372 మందికి వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో లక్షణాలున్న 2,148 మందిని గుర్తించారు. 51,735 ఇళ్లను సిబ్బంది సందర్శించి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కిట్లును పంపిణీ చేశారు. 


కూకట్‌పల్లిలో 246  

కూకట్‌పల్లి పరిధిలో గురువారం 246 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

శేరిలింగంపల్లిలో 201  

శేరిలింగంపల్లి మండలంలో 201 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదైనట్లు మండ ల వైద్యాధికారి డాక్టర్‌ రామిరెడ్డి తెలిపారు. 

కుత్బుల్లాపూర్‌లో 171  

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్‌సీలు, దుండిగల్‌ పీహెచ్‌సీతోపాటు రెండు బస్తీ దవాఖానాల్లో 171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

Read more