Hyderabadలో పెరుగుతున్న Covid ఫోర్త్ వేవ్

ABN , First Publish Date - 2022-06-07T17:49:20+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ (Covid Fourth Wave) హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Hyderabadలో పెరుగుతున్న Covid ఫోర్త్ వేవ్

Hyderabad: దేశవ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ (Covid Fourth Wave) హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రెండు, మూడు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్రం అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamil Nadu), మహరాష్ట్ర (Maharashtra), కర్నాటక (Karnataka) రాష్ట్రాలు ఉన్నాయి. గత రెండు వారాలుగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 6 వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, మాస్క్, సామాజిక దూరం పాటించకపోవడం.. కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2022-06-07T17:49:20+05:30 IST