Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తొలగిన వివాదం

ABN , First Publish Date - 2022-09-08T15:13:44+05:30 IST

నగరంలోని హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై వివాదం తొలగింది.

Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తొలగిన వివాదం

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్‌ (Hussain sagar)లో గణేష్ నిమజ్జనం (Ganesh immersion)పై వివాదం తొలగింది. రేపటి గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్‌ (Tank bund)పై  జీహెచ్ఎంసీ (GHMC) భారీగా ఏర్పాట్లు చేయనుంది. ట్యాంక్ బండ్‌పై 15 క్రేన్లు.. ఎన్టీఆర్ మార్గ్‌లో 9.. పీవీ మార్గ్‌లో 8 క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతితో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లభించింది. అలాగే 74 ప్రాంతాల్లో బేబీ పౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జన విధుల్లో దాదాపు 10 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొననుంది. నిమజ్జనాల పర్యవేక్షణకు 168 మందితో బల్దియా అధికారుల బృందం సిద్ధమైంది.


Updated Date - 2022-09-08T15:13:44+05:30 IST