నేడు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు

ABN , First Publish Date - 2022-11-24T03:40:28+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ, ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గురువారం అన్ని మండల కేంద్రా ల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నేడు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు

హైదరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గురువారం అన్ని మండల కేంద్రా ల్లో కాంగ్రెస్‌ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అనంతరం ఆ పార్టీ నేతలు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 24న మండల, 30న నియోజకవర్గ, డిసెంబర్‌ 5న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ నిరసన కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా జిల్లాకు ఒక ముఖ్యనేతను సమన్వయ కర్తగా నియమించారు.

Updated Date - 2022-11-24T03:40:28+05:30 IST

Read more